సుప్రీం కామెంట్స్ తో సిట్ నిలిపివేత
స్పష్టం చేసిన ఏపీ డీజీపీ ద్వారకా
తిరుపతి – ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి లడ్డూ కల్తీ ప్రసాదం విషయంపై అసలు వాస్తవాలు తేల్చేందుకు గూంటూర్ రేంజ్ డీఐజీ త్రిపాఠి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ ను తాత్కాలికంగా నిలిపి వేసింది. ఈ విషయాన్ని ప్రకటించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘సిట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని తెలిపారు. అందుకే నిన్న కొన్ని వాదనలు జరిగాయి. కాబట్టి తదుపరి విచారణను అక్టోబర్ 3 వరకు నిలిపివేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు.
తమ సిట్ బృందం నిన్న, మొన్న టి.టి.డి.లోని వివిధ ప్రాంతాలు, కొనుగోళ్ల ప్రాంతం, శాంపిల్ సేకరణ ప్రాంతాలను సందర్శించి పలువురి నుంచి సమాచారాన్ని సేకరించిందని చెప్పారు. . గత సాయంత్రం, సుప్రీంకోర్టు కొంత కాలం పాటు నిలిపి వేయాలని చెప్పినట్లు తమకు సమాచారం అందిందన్నారు.కాబట్టి, సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి, ప్రస్తుతానికి తాము సిట్ ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు ఏపీ డీజీపీ.