చూస్తే చిన్నది మెస్మరైజ్ చేసింది
దక్షిణాఫ్రికా 5 ఏళ్ల బాలిక సెన్సేషన్
హైదరాబాద్ – జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో. ఎప్పుడు ఎలా అదృష్టం తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. చూస్తే పట్టుమని 5 ఏళ్లు. కానీ ఈ చిన్నారి ఊహించని రీతిలో ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసే స్థాయికి ఎదిగింది. కారణం ఒకే ఒక్క ఫోటో. సామాజిక మాధ్యమాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. టెక్నాలజీ పుణ్యమా అని క్షణాల్లో సెన్సేషన్ అవుతున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ చిన్నారి ఇప్పుడు ఓ బ్రెడ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారి పోయింది.
సదరు కంపెనీ పేరు ఆల్బానీ . ఆ చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం ఫోటోగ్రాఫర్ లుంగిసాని మాజీ. ఆ పాప తన మేన కోడలు. నవ్వుతూ ఆల్బానీ బ్రెడ్ ను పట్టుకుని ఉన్న అందమైన చిత్రాన్ని తన ఫోన్ లో బంధించారు. అది ఇప్పుడు కోట్లాది మందిని ఆకట్టుకునేలా చేసింది. ఎవరీ ఈ చిన్నారి..ఇంతలా కల్మషం లేకుండా నవ్వుతోంది అంటూ చూసిన వారంతా తెగ ముచ్చట పడుతున్నారు.
ఒక్క చిన్న బ్రెడ్ ముక్క ఆ పాప కళ్లల్లో సంతోషాన్ని, పెదవుల మీద దరహాసాన్ని అందించేలా చేసింది. ఎందరినో మనసు దోచుకున్న ఈ చిన్నారి పేరు లెతుకుఖున్యా మాజీ. ఆ చిన్నారికి అల్బానీ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ బ్రెడ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. అంతే కాదు చిన్నారి ఎంత వరకు చదివితే అంత దాకా అయ్యే ఖర్చులను తామే భరిస్తామని తెలిపింది . అల్బానీ బ్రెడ్ గర్ల్ గా పాపులర్ అయ్యింది ఈ పాప. ఆన్ లైన్ లో మిలియన్ల కొద్దీ వీక్షించారు.
ఏది ఏమైనా మిల్ అల్బానీ ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేయడం విచిత్రం కదూ. కల్మషం లేని నవ్వు గుండెల్ని మీటుతుంది. కలకాలం దాచుకునేలా చేస్తుంది. చిన్నారి చిరునవ్వు ఎప్పటికీ జ్ఞాపకంగా ఉంటుందనడంలో సందేహం లేదు.