షిబుయా తరహా ట్రాఫిక్ నియంత్రణ భేష్ – భట్టి
జపాన్ సర్కార్ కు కితాబు ఇచ్చిన డిప్యూటీ సీఎం
జపాన్ – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన అమెరికాలో పర్యటించారు. అక్కడ మైనింగ్ పరిశ్రమకు సంబంధించి ఏర్పాటు చేసిన ఎక్స్ పోలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి జపాన్ లో పర్యటించారు.
ఈ సందర్బంగా ఆ దేశ రాజధాని టోక్యోను సందర్శించారు మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో కూడా షిబుయా తరహా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు మల్లు భట్టి విక్రమార్క.
టోక్యో నగరంలో హచుకో రైల్వే స్టేషన్ వద్ద ఉన్న షిబుయా క్రాసింగ్ ను సందర్శించడం జరిగిందని తెలిపారు. తనను బాగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఇక్కడ ఒకేసారిగా 3,000 మంది పాదచారులు రోజుకు కనీసం 5 లక్షల మంది ఒక్క చిన్న ప్రమాదం జరగకుండా రైల్వే , రోడ్డు కూడలి రోడ్లు దాటడానికి చేసిన ఏర్పాటు అద్భతమన్నారు.
హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో షిబుయా తరహా ట్రాఫిక్ నియంత్రణ పద్ధతిని అమలు పరచడానికి వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతికత గురించి అధికారులను అడిగి తెలుసు కోవడం జరిగిందన్నారు.