స‌త్య‌సాయి బాబా జీవితం ప్రాతః స్మ‌ర‌ణీయం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా జీవితం ప్రాతః స్మ‌ర‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో కృషి చేశారని ప్ర‌శంసించారు. జీవితంలో చివరి దశలో మరణం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న దశలో ఎంతో మందిని బతికించి దేవుడిగా కొలువ బడుతున్నాడని పేర్కొన్నారు.

పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కునారిల్లుతున్న కాలంలో, ప్రభుత్వాలు సైతం తాగునీటి సౌకర్యాలు కల్పించలేని కాలంలో సొంత జిల్లా పాలమూరు దాహర్తిని తీర్చార‌ని గుర్తు చేశారు ఎ. రేవంత్ రెడ్డి. అనంతపురం జిల్లాలో తాగునీటి సౌకర్యం కల్పించారు. తమిళనాడు రాష్ట్రంలో సైతం బాబా సేవలను విస్తృత పరిచి ఈనాడు అందరి మనసుల్లో దేవుడిగా శాశ్వత స్థానం సాధించార‌ని చెప్పారు.

మానవ సేవ మాధవ సేవ అని బోధించడమే కాకుండా సంపూర్ణంగా నమ్మి విశ్వసించార‌ని అన్నారు. ఈనాడు 140 దేశాల్లో బాబాకి భక్తులు ఉండటమే కాకుండా వారంతా వివిధ మార్గాల్లో సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, దాదాపు 40 నుంచి 50 దేశాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారంటే వారి ప్రత్యేకతను గుర్తు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

సత్య సాయిబాబా ఆలోచనలను, వారు అనుసరించిన విధానాలను ప్రజలకు చేర వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి సాయి కుల్వంత్ హాలులోని సత్య సాయిబాబా మహా సమాధిని దర్శించుకున్నారు.

  • Related Posts

    ప్ర‌శ్నించ‌డం తోనే ప్ర‌జాస్వామ్యానికి మ‌నుగ‌డ‌

    న్యూఢిల్లీ : ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ భూయాన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌శ్నించ‌డం తోనే ప్ర‌జాస్వామ్యానికి మ‌నుగ‌డ సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా తనను ఆహ్వానించడాన్ని నిరసించినందుకు ఆ యూనివర్సిటీ విద్యార్థుల నమోదును నిషేధించాలన్న బార్…

    దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

    చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తీపి క‌బురు చెప్పారు. కాళ్లు ప్రభావితమై, చేతులు బాగా పనిచేసే దివ్యాంగులకు ప్రత్యేకంగా రూపొందించిన చక్రాలతో కూడిన తక్కువ ఎత్తు గల స్కూటర్లను పంపిణీ చేస్తామని విజయ్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *