నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంక‌ట్రాం రెడ్డి

హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన శాస‌న మండ‌లి స‌భ్యుడు (ఎమ్మెల్సీ) వెంక‌ట్రాం రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న కొడుకు భ‌ర‌త్ రాజ్ రెడ్డి గురించి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి ఆధారాలు లేకుండా వార్త‌ల‌ను ప్ర‌చురించ‌డం, ప్ర‌సారం చేయ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌రైన వివ‌రాలు సేక‌రించ‌కుండానే ఇలా త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు. భరత్ రాజ్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నాడ‌ని, ఈ మేర‌కు మంగళ్ హాట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు జరుగుతున్న ప్రచారం లో వాస్తవం లేదని స్ప‌ష్టం చేశారు. మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధార‌మైన‌వ‌ని, సత్య‌దూర‌మ‌ని పేర్కొన్నారు. .

ఈ రోజు ఉదయం మంగళ్ హాట్ పోలీసులు మా ఇంటికి వచ్చి ఒక డ్రగ్స్ కు సంబంధించి కేసు విచారణ జరుపుతున్నామని.. భరత్ రాజ్ రెడ్డి కామన్ ఫ్రెండ్స్ ఫోన్ జాబితాలో తన ఫోన్ నెంబర్ ఉండడంతో అనుమానంతో విచారించాల్సి ఉందని కోరారని తెలిపారు ఎమ్మెల్సీ వెంక‌ట్రాం రెడ్డి. విచారణలో ఈ డ్రగ్స్ కేసు వ్యవహారానికి భరత్ రాజ్ రెడ్డికి ఏ సంబంధం లేదని పోలీసులు నిర్ధారించుకున్నారని ఆ విష‌యం వారిని అడగితే తెలుస్తుంద‌న్నారు. త‌న కొడుకుకు చేసిన డ్రగ్స్ టెస్ట్ లో నెగెటీవ్ వచ్చిందన్నారు. నాకుమారుడు ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని, ఈ కేసులో అరెస్ట్ కాలేదు. దయచేసి గమనించాల‌ని ఎమ్మెల్సీ కోరారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *