కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. పాల్గొన్న స‌భ్యులు కీల‌క ప్ర‌శ్న‌లు సంధించారు. దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం బీజేపీ మోదీ పాల‌న‌లో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేకించి స‌ర్ పేరుతో ఓట‌ర్ల‌ను తొలగించే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. చాలా రాష్ట్రాల‌లో తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ కేవ‌లం మూడు రాష్ట్రాల‌లో మాత్ర‌మే ప‌వ‌ర్ లో ఉంది. ఒక‌టి తెలంగాణ రెండు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మూడు క‌ర్ణాట‌క‌. ఇక త‌మిళ‌నాడుతో పాటు కేర‌ళ‌లో సంకీర్ణ ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఎలా బ‌లోపేతం చేయాల‌నే దానిపై తీవ్రంగా చ‌ర్చించారు. కింది స్తాయి నుంచి పై స్తాయి వ‌ర‌కు ఎలా అధికార పార్టీ ఆగ‌డాల‌ను ఎదుర్కోవాల‌నే దానిపై కూడా ప్ర‌స్తావించిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం.

  • Related Posts

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

    అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *