ఆ న‌టుల‌తో న‌టించ‌డం మ‌రిచి పోలేని అనుభ‌వం

చెన్నై : అందాల ముద్దుగుమ్మ‌గా పేరు పొందిన వ‌ర్ద‌మాన న‌టి న‌మిత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె ఎంద‌రో న‌టుల‌తో క‌లిసి న‌టించింది. తాజాగా త‌ను న‌టించిన న‌టుల‌లో ఎవ‌రు త‌న‌కు బాగా నచ్చార‌నే విష‌యాన్ని పంచుకుంది. సీఎం విజయ్, అజిత్ , బాలకృష్ణలతో తనకున్న జ్ఞాపకాల గురించి నోరు విప్పింది . ఈ ముగ్గురు న‌టుల‌తో కలిసి పని చేసినప్పుడు తనకు కలిగిన మధురమైన అనుభవాల గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించింది న‌టి న‌మిత‌. పూజ రోజు వరకు నేను నిజంగా విజయ్‌తో నటించ బోతున్నాననే విషయాన్ని నమ్మలేక పోయాను. ప్రభుదేవా , జూనియర్ ఎన్టీఆర్ లాగే విజయ్‌కి కూడా అద్భుతమైన డ్యాన్స్ నైపుణ్యాలు ఉన్నాయంటూ కితాబు ఇచ్చింది.

ఇక మ‌రో త‌మిళ న‌టుడు అజిత్ కుమార్ గురించి కూడా చెప్పింది. అజిత్ చాలా స్టైలిష్ వ్యక్తి, కార్లంటే అమితమైన ఆసక్తి ఉన్నవారు . చాలా ప్రశాంతంగా, మర్యాదగా మాట్లాడేవారు. ‘బిల్లా’ షూటింగ్ అనుభవం మొత్తం ఒక కుటుంబంలో ఉన్నట్లుగా అనిపించింది అని గుర్తు చేసుకుంది. సెట్స్‌లో నంద‌మూరి బాలకృష్ణ ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఉదయం 8 గంటలకు షూటింగ్ ఉన్నా సరే, ఆయన 7:30 గంటలకే అక్కడికి చేరుకునే వారు. నేను లొకేషన్‌కు వెళ్లేసరికే తన సన్నివేశాల్లో నటిస్తూ ఉండేవారు. ఆయనతో పేకాట ఎలా ఆడాలో తెలియక భయపడి అక్కడి నుండి పారిపోయిన విషయం కూడా నాకు గుర్తుంది అని తెలిపింది. తాజాగా ఆయా న‌టుల గురించి చేసిన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

  • Related Posts

    గాయం త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న షూటింగ్ కు రెడీ

    హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఇటీవ‌లే సినిమా షూటింగ్ సంద‌ర్బంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆమె తుంటి గాయం నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని పంచుకుంటూ రష్మిక త్వరలోనే తన వృత్తిపరమైన పనులను తిరిగి…

    జోరుగా మెగాస్టార్ ‘విశ్వంభర’ షూటింగ్

    హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఇందులో చిరంజీవితో పాటు ఇతర కీలక నటులు కూడా పాల్గొంటున్నారు. మిగిలిన సన్నివేశాలను కూడా మరో రెండు రోజుల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *