Friday, 16 October 2026

డాల‌ర్ ఎఫెక్ట్ 13 పైస‌లు త‌గ్గిన భార‌తీయ రూపాయి

newsseals-IndianRupee

ముంబై : ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 13 పైసలు తగ్గి 95.56కు చేరింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సెప్టెంబర్‌లో ఫెడ్ (US Federal Reserve) వడ్డీ రేట్ల పెంపుపై ఉన్న అంచనాలు భారతీయ కరెన్సీపై ఒత్తిడిని పెంచాయి. ముడి చమురు ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలపడుతున్న డాలర్ కారణంగా ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ త‌గ్గింది. సోమవారం ఉదయం ముడి చమురు ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఒత్తిడితో రూపాయి విలువ 13 పైసలు తగ్గి 95.56 వద్ద ట్రేడైంది. సెప్టెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయని, దీనివల్ల అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడి (yields) పెరిగి, డాలర్ విలువ బలపడిందని తద్వారా పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నదని ఫారెక్స్ వ్యాపారులు పేర్కొన్నారు.

ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారకం మార్కెట్‌లో రూపాయి 95.56 వద్ద ప్రారంభమైంది, ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 13 పైసల తగ్గుదల. శుక్రవారం నాడు రూపాయి స్వల్పంగా 2 పైసలు పెరిగి అమెరికా డాలర్‌తో పోలిస్తే 95.43 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 99.62 స్థాయి వద్ద ఉండటం , నాటి స్థాయిల నుండి ఇతర ఆస్తుల విలువలు తగ్గడం వల్ల రూపాయి విలువ తక్కువగా ప్రారంభమైందని ‘ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ LLP’ ట్రెజరీ విభాగం అధిపతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ తెలిపారు. కరెన్సీల కదలికలో స్పష్టమైన దిశ కనిపించక పోవడంతో, రూపాయి విలువ 95.25 నుండి 95.75 శ్రేణిలో ఉంటుందని, ఎగుమతిదారులు 95.60 స్థాయిల వద్ద అమ్మకాలు జరపవచ్చని , దిగుమతిదారులు ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయవచ్చని భన్సాలీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *