Saturday, 28 November 2026

క‌ర్ణాట‌క‌లో జీఎస్ఎస్జీ హోల్డింగ్స్ భారీ ఇన్వెస్ట్

newsseals-DKShivakummar

బెంగ‌ళూరు : ఖతార్‌కు చెందిన ప్ర‌ముఖ సంస్థ జీఎస్ఎస్జీ హోల్డింగ్స్ గంగాలోని ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ , ఉప ముఖ్యమంత్రి డా. జి. పరమేశ్వరతో సమావేశమై చర్చలు జరిపింది. కర్ణాటకలోని పలు రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ఆసక్తిని వ్యక్తం చేసింది. ముఖ్యంగా బెంగళూరు-తుమకూరు మెట్రో పీపీపీ (PPP) ప్రాజెక్ట్ , కంతీరవ స్టేడియం ఆధునీకరణ పీపీపీ (PPP) ప్రాజెక్టుల గురించి చర్చించింది. ఈ కార్యక్రమంలో జీఎస్ఎస్జీ ఛైర్మన్ ఘనీమ్ అల్ కువారీ, శ్రీ అశ్విన్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా కర్ణాటకలోని వివిధ రంగాలలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించేందుకు ఆ ప్రతినిధి బృందం ఆసక్తిని వ్యక్తం చేసింది. ప్రతిపాదిత బెంగళూరు-తుమకూరు మెట్రో పీపీపీ ప్రాజెక్ట్ , పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) నమూనా కింద కంఠీరవ స్టేడియం ఆధునీకరణపై చర్చలు జరిగాయి. ఈ సంద‌ర్బంగా కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు భేటీ అనంత‌రం ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ తెలిపారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ ప్ర‌భుత్వం పెట్టుబ‌డిదారుల‌కు పూర్తి సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే దేశంలో ఇన్వెస్ట‌ర్ల‌కు స్వ‌ర్గ‌ధామంగా క‌ర్ణాట‌క పేరు పొందింద‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఐటీ, లాజిస్టిక్, త‌దిత‌ర రంగాల‌లో క‌ర్ణాట‌క టాప్ లో కొన‌సాగుతోంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *