NEWSTELANGANA

అదానీ నిర్వాకం పెన్నా కాలుష్యం

Share it with your family & friends

ప్ర‌జ‌ల జీవితాలా..అదానీకి ముడుపులా

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. న‌ల్ల‌గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన పెన్నా సిమెంట్ ప‌రిశ్ర‌మ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. దీని కార‌ణంగా వెద‌జ‌ల్లుతున్న కాలుష్యం చుట్టు ప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

ఈ పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీని ఇటీవలే గౌతమ్ అదాని కొనుగోలు చేశాడ‌ని, ఇది న‌ల్ల‌గొండ జిల్లా దామ‌చ‌ర్ల మండ‌లం గ‌ణేష్ ప‌హాడ్ గ్రామంలో ఉంద‌ని తెలిపారు. ఈ మధ్య కాలం నుండి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి భారీగా పొగలు రావడం జరుగుతున్న‌త‌ని వాపోయారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

దీని కాలుష్యం వల్ల చుట్టూ పక్కల ఉన్న శూన్య పహాడ్, రావి పహాడ్, జాన్ పహాడ్ లాంటి గ్రామాల్లో ప్రజలు కొన్ని నెలల నుండి తీవ్రంగా మోకాలు నొప్పితో, జ్వరంతో బాధ పడుతున్నారని బాధితులు వాపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ కాలుష్యం వల్ల పంట పొలాలు కూడా ఆగం అయే పరిస్థితి ఉందని హెచ్చ‌రించారు.

చుట్టూ పక్కల ఉన్న గ్రామాల్లో అంతా ఈ ఫ్యాక్టరీ నుండి వచ్చే పొగ కాలుష్యం తో ఇంటి చుట్టూ దుమ్ము, ధూళి అంతా పేరుకుపోతున్న‌ద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల జీవితాలు ర‌క్షించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని, కానీ స‌ర్కార్ , సీఎం రేవంత్ రెడ్డి గౌతం అదానీకి వంత పాడ‌టం దారుణ‌మ‌ని అన్నారు.