‘తలపతి 69’లో మూవీలో పూజా హెగ్డే
ప్రకటించిన దర్శక, నిర్మాతల బృందం
హైదరాబాద్ – అందాల ముందుగుమ్మ పూజా హెగ్డే కు బంపర్ ఆఫర్ దక్కింది. మరోసారి ఆమె తమిళ సినీ సూపర్ స్టార్ తళపతి విజయ్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. గత కొంత కాలంగా గ్యాప్ తీసుకున్న తర్వాత పూజాకు ఊహించని రీతిలో ఛాన్స్ దక్కడం విస్తు పోయేలా చేసింది.
ఇదిలా ఉండగా తన ఆఖరి చిత్రం తలపతి 69 అని ప్రకటించారు నటుడు విజయ్. గతంలో 2022లో వచ్చిన బీస్ట్ చిత్రంలో ప్రధాన హీరోయిన్ గా నటించింది పూజా హెగ్డే. ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అభిమానులను అలరించేలా చేసింది. భారీ కలెక్షన్స్ వసూలు చేసింది.
ప్రస్తుతం తాత్కాలిక టైటిల్ చిత్రం ‘తలపతి 69’లో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు పూజా హెగ్డే. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోంది . మరో వైపు 2014లో సతురంగ వేట్లై అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన హెచ్ వినోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
అంతకు ముందు తీరన్ అధిగారం ఒండ్రు, నేర్కొండ పార్వై, వలిమై , తునీవు వంటి హిట్ చిత్రాలను అందించాడు డైరెక్టర్. ఇక విజయ్ తన సినీ కెరీర్ లో చివరి చిత్రం తలపతి 69 కావడంతో అందరి కళ్లు దీనిపైనే ఉన్నాయి. ఆయన కొత్తగా పార్టీని ప్రకటించాడు. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యాడు.