ఆంధ్రప్రదేశ్ లో చెత్త పై పన్ను రద్దు – సీఎం
బందరులో నారా చంద్రబాబు ప్రకటన
మచిలీపట్నం – ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 2 న మహాత్మా గాంధీ జయంతి జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా బాబు చేసిన ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చెత్తపై పన్ను విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
చెత్త పన్ను ద్వారా ప్రజలపై బాదుడును గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పు పట్టారు.
బుధవారం మచిలీపట్నంలో గాంధీ జయంతి సందర్భంగా… స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. వచ్చే క్యాబినెట్లో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపి తగు ఉత్తర్వులు ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. చెత్తపన్ను రద్దు చేస్తామన్న ఎన్నికల హామీని ఈ రోజు ప్రకటన ద్వారా చంద్రబాబు అమల్లోకి వచ్చేలా చేయడం విశేషం.