మహాత్ముడి జీవితం స్పూర్తి దాయకం
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
అమెరికా – మహాత్ముడు, జాతిపిత మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ జీవితం స్పూర్తి దాయకమని పేర్కొన్నారు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా అమెరికాలోని డల్లాస్ లో గాంధీ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో వీరు ప్రత్యేకంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
గత వారం రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహాత్మా గాంధీ అహింసా మార్గంలో దేశానికి అందించిన సేవలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందాయని, ఆయన పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ కోమటి జయరాం, ఎన్నారై ఇన్వెస్టర్స్ కోఆర్డినేటర్ రామకృష్ణ గుళ్లపల్లి, ఇతర ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.