DEVOTIONAL

వెంగ‌మాంబ అన్న‌దాన కేంద్రం సంద‌ర్శ‌న

Share it with your family & friends

భ‌క్తుల‌తో క‌లిసి అన్న ప్ర‌సాదం ప‌వ‌న్ స్వీక‌ర‌ణ

తిరుమ‌ల – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న కూతుళ్ల‌తో క‌లిసి బుధ‌వారం తిరుమ‌ల‌ను సంద‌ర్శించారు. తాను 11 రోజులుగా చేప‌ట్టిన ప్రాయ‌శ్చిత్త దీక్ష‌ను ఇవాల్టితో ముగించారు. ఆయ‌న‌కు ఆల‌య అధికారులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. స్వామి వారికి పూజ‌లు చేశారు. అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు వేద పండితులు ఆశీర్వ‌చ‌నం అందజేశారు. ఈ సంద‌ర్బంగా స్వామి వారి ప్ర‌సాదం, చిత్ర ప‌టాన్ని బ‌హూక‌రించారు.

స్వామి వారి ద‌ర్శ‌నం అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రాన్ని సందర్శించారు.

అన్నదాన కేంద్రంలోనూ ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు. భక్తులకు జరుగుతున్న అన్నదాన సరళిని పరిశీలించారు. అనంతరం సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.

దర్శనానికి ముందు చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెలతో డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేయించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజనితో స్వయంగా డిక్లరేషన్ ఇప్పించారు.