కేటీఆర్ కామెంట్స్ పొన్నం సీరియస్
రాహుల్ గాంధీపై ఆరోపణలు తగదు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సీరియస్ అయ్యారు. ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని పేర్కొన్నారు పొన్నం ప్రభాకర్ .
తమ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురించి వ్యక్తిగతంగా కేటీఆర్ దూషించడం, కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది కేటీఆర్ కు తగదని హితవు పలికారు.
రాహుల్ ను ఉద్దేశించి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూన్నానని అన్నారు మంత్రి.
చిల్లర రాజకీయాలు మాని హుందాగా వ్యవహరించాలని కేటీఆర్ కు సూచిస్తున్నానని తెలిపాలనలో రాష్ట్ర పరిపాలన లో రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనం అంటూ స్పష్టం చేశారు.
అసలు మూసి పై బిఆర్ఎస్ పార్టీ వైఖరిని ప్రశ్నిస్తున్నానని అన్నారు. మూసి బాధితులకు ప్రత్యమ్నాయం చూడకుండా ఒక ఇల్లు కూడా కూల్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.
తమ పార్టీ పేదల పార్టీ అని, పేదలు, సామాన్యులను ఇబ్బందులకు గురి చేసే ఏ పని తమ సర్కార్ చేయబోదంటూ హామీ ఇచ్చారు . వీలు అయితే ప్రతిపక్షం బాధ్యత తో నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరారు .