కొండా సురేఖ కామెంట్స్ బాధాకరం – పురంధేశ్వరి
ఆమె తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచన
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సీరియస్ అయ్యారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చకుండా ఉండేందుకు కేటీఆర్ వద్దకు ఒక్క రాత్రి సమంత రుత్ ప్రభు వెళ్లాలని అక్కినేని నాగార్జున , అమల ఫ్యామిలీ ఒత్తిడి చేసిందంటూ సంచలన ఆరోపణలు చేయడాన్ని తప్పు పట్టారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు.
రాజకీయ నాయకులు దేశానికి, రాష్ట్రానికి సేవ చేస్తే, సినీ నటులు ప్రజలను వినోదం పరచడం ద్వారా సేవ చేస్తారని పేర్కొన్నారు దగ్గుబాటి పురందేశ్వరి.. ఎంతో మంది సినిమా నటులు రాజకీయాల్లోకి ప్రవేశించి, సామాన్య ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించారని స్పష్టం చేశారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరుల వ్యక్తిత్వాన్ని కించ పరచకుండా, పరస్పరం వ్యక్తిగతంగా, వృత్తి పరంగా గౌరవించడం సముచితంగా ఉంటుందని కొండా సురేఖకు హితవు పలికారు. .సినిమా పరిశ్రమ, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేసిన వ్యక్తులు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, అలాగే ఒక మహిళగా, తాను కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.