ENTERTAINMENT

కొండా సురేఖ వ్యాఖ్య‌లు దారుణం – చిరంజీవి

Share it with your family & friends

ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని మెగాస్టార్ హిత‌వు

హైద‌రాబాద్ – త‌న ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ను కూల్చ‌కుండా ఉండేందుకు కేటీఆర్ వ‌ద్ద‌కు ఒక్క రాత్రి స‌మంత రుత్ ప్ర‌భు వెళ్లాల‌ని అక్కినేని నాగార్జున , అమ‌ల ఫ్యామిలీ ఒత్తిడి చేసిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌. ఆమె చేసిన వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

దీనిపై తీవ్రంగా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఒక మంత్రిగా బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్య‌లు మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తాను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. చాలా బాధ‌కు లోనయ్యాన‌ని పేర్కొన్నారు మెగాస్టార్.
.
సినీ రంగానికి చెందిన త‌మ వారిపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను చిత్ర పరిశ్రమ మొత్తం ఖండిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. సంబంధం లేని వ్యక్తులను, అంతకు మించి మహిళలను తమ రాజకీయ స్లగ్ ఫెస్ట్‌లోకి లాగడం , అసహ్యకరమైన కల్పిత ఆరోపణలు చేయడం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇది దారుణ‌మ‌ని పేర్కొన్నారు.
నేత‌లు, మంత్రులు , ఇత‌రులు స‌మాజానికి ఆద‌ర్శ ప్రాయంగా ఉండేలా తప్పా ఇలా డ్యామేజ్ చేసేలా ఉండ కూడ‌ద‌న్నారు.

ప్రజా ప్రతినిధిగా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి ఆధరాలు లేని ఆరోపణ‌లు చెయ్యడం సంస్కార హీనం అవుతుందని తెలుసు కోవాల‌న్నారు. స్వలాభాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. నాగార్జున కుటుంబానికి, స‌మంత‌కు, చిత్ర సీమ‌కు తోడుగా ఉంటాన‌ని తెలిపారు.