దిగొచ్చిన యాజమాన్యం కాంగ్రెస్ విజయం – షర్మిల
ఇది కాంగ్రెస్ విజయమన్న ఏపీపీసీసీ చీఫ్
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ రాష్ట్రానికి తల మానికంగా నిలిచిన విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా షర్మిల ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో ఏపీ సర్కార్ కు 48 గంటల డెడ్ లైన్ విధించారు.
తాము ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు వైఎస్ షర్మిలా రెడ్డి. తాము పెట్టిన గడువుకు దిగి రావడం పట్ల స్వాగతించారు. విశాఖ ఉక్కు యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉప సంహరించుకొంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
విశాఖ ఉక్కు కార్మాగారంలో తొలగించిన 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంగా ఆమె స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్ కార్మికులకు మాట ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మీ పక్షం. మీకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఇవ్వాళ కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన పోరాడి గెలిచాం. ఇదే స్పూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. మోడీ మెడలు వంచి మన ఆత్మ గౌరవం విశాఖ ఉక్కును పరిరక్షించుకుందామని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్.