NEWSINTERNATIONAL

పేద‌రిక నిర్మూల‌నపై ఫోక‌స్ – దిస్స‌నాయ‌కే

Share it with your family & friends

కీల‌క మంత్రిత్వ శాఖ‌లు శ్రీ‌లంక ప్రెసిడెంట్ కే

శ్రీ‌లంక – శ్రీ‌లంక దేశ నూత‌న అధ్య‌క్షుడు అనుర కుమార దిస్స‌నాయ‌కే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న ప్ర‌ధాన శాఖ‌లకు సంబంధించి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్బంగా జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. దేశంలో పేద‌రికం అన్న‌ది లేకుండా చేయాల‌న్న‌దే త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందు కోసం తాను శాయ శ‌క్తులా శక్తి వంచ‌న లేకుండా చేస్తాన‌ని పేర్కొన్నారు.

ప్ర‌ధానంగా వ్యవసాయం, భూములు, పశుసంవర్ధక, నీటిపారుదల, మత్స్య, జలవనరుల శాఖ మంత్రిగా నేను ఇవాళ అధికారికంగా బాధ్యతలు స్వీకరించడం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నారు. ప్ర‌ధానంగా గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడంలో మంత్రిత్వ శాఖ పాత్ర అపారమైనదని పేర్కొన్నారు అనుర కుమార దిస్స‌నాయ‌కే.

సమర్ధవంతమైన, ప్రతిస్పందించే ప్రజా సేవను రూపొందించడంలో సహాయ ప‌డటానికి అంకితభావం గల ప్రభుత్వ సేవకుల సేవ‌లు ముఖ్య‌మ‌ని అన్నారు. సాంప్రదాయ రాజకీయ ప్రతీకార చర్యలను భవిష్యత్తులో సహించరు.

మునుపటి నాయకులు చేసిన విధంగా తాము మీడియా ముందు అధికారులను బహిరంగంగా ప్రశ్నించ బోమంటూ స్ప‌ష్టం చేశారు. పౌరులను సంతృప్తి పరిచే, ప్రభుత్వ ఉద్యోగుల గౌరవాన్ని కాపాడే ప్రజా సేవను నిర్మించడమే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు అనుర కుమార దిస్స‌నాయ‌కే.

పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రిత్వ శాఖ అధికారులతో జరిగిన చర్చల సందర్భంగా నేను ఈ అంశాలను నొక్కి చెప్పానని తెలిపారు.