ENTERTAINMENT

స‌మాజం మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు – తార‌క్

Share it with your family & friends

కొండా సురేఖ కామెంట్స్ పై ఆగ్ర‌హం

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున‌, నాగ చైత‌న్య‌, స‌మంత వ్య‌వ‌హారానికి సంబంధించి చేసిన వ్యాఖ్య‌లు అత్యంత దారుణ‌మ‌ని పేర్కొన్నారు. గురువారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఒక బాధ్య‌త క‌లిగిన మంత్రి ప‌ద‌విలో ఉన్న మీరు ప‌దిమందికి ఆద‌ర్శ ప్రాయంగా ఉండేలా త‌ప్పా ఇంకొక‌రితో చెప్పించుకునే స్థాయికి దిగజార కూడ‌ద‌ని పేర్కొన్నారు.

వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం కొత్త తక్కువ. పబ్లిక్ ఫిగర్లు, ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను గౌరవించాలని సూచించారు జూనియ‌ర్ ఎన్టీఆర్.

ముఖ్యంగా సినిమా పరిశ్రమ గురించి నిర్లక్ష్య పూరితంగా విసురుతున్న నిరాధారమైన ప్రకటనలు చూసి నిరుత్సాహంగా ఉందన్నారు. ఇతరులు త‌మ‌పై నిరాధార ఆరోపణలు చేస్తుంటే తాము చూస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు.

ప్రజాస్వామ్య భారతదేశంలో మన సమాజం అటువంటి నిర్లక్ష్య ప్రవర్తనను సాధారణీ కరించకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు.