ENTERTAINMENT

అధికారం ఒక బాధ్య‌త దాన్ని విస్మ‌రిస్తే ఎలా..?

Share it with your family & friends

ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై భ‌గ్గుమంటున్నారు సినీ రంగానికి చెందిన న‌టీ న‌టులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ తెలంగాణ‌కు చెందిన ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల తీవ్రంగా స్పందించారు. ఆయ‌న గురువారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా కీల‌క కామెంట్స్ చేశారు.

ఇది ఎంత మాత్రం మంచిది కాద‌ని పేర్కొన్నారు. అధికారం అన్న‌ది ఒక బాధ్య‌త అని , దానిని విస్మ‌రిస్తే ఎలా అని ప్ర‌శ్నించారు వేణు ఉడుగుల‌. చౌక‌బారు వ్యూహాల‌కు ఇది వేదిక కాద‌ని తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.

ప్ర‌తి రంగంలో మంచి, చెడులు ఉంటాయ‌ని, కానీ వాటిని ప్ర‌శ్నించాల్సిన స‌మ‌యం, వేదిక ఇది కాద‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రీకీ త‌మ వ్య‌క్తిగ‌త విష‌యాల జోలికి రాకూడ‌ద‌ని తెలిపారు. కొండా సురేఖ నిర్ల‌క్ష్యపు వ్యాఖ్య‌లు సంబంధం లేని వ్య‌క్తుల‌ను వివాదంలోకి లాగేలా చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఆమె వాద‌న‌లు నిజ‌మైతే చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల‌.