కేటీఆర్..హరీశ్ ఫామ్ హస్ లు కూల్చేస్తాం – సీఎం
సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ ల సంగతి ఏంది
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం జరిగిన సభలో ప్రసంగించారు. సబితా ఇంద్రారెడ్డి ఫామ్‌హౌస్ కూలగొట్టాలా? వద్దా..?.. సబితమ్మ ముగ్గురు కొడుకులకు ఫామ్‌హౌస్‌లు లేవా అని ప్రశ్నించారు.
నీ ఫామ్‌హౌస్‌ల లెక్క కూడా ఉందన్నారు హరీష్‌రావుకు అజిజ్‌పూర్‌లో ఫాంహౌస్ ఉంది కదా.. అది అక్రమం కాదా?.. బావ, బామ్మర్దులు కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. మూసీని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు బతుకుతారు?.. మూసీ పరీవాహక పేదలకు ఇళ్లు ఇవ్వాలా.. వద్దా..అని నిలదీశారు.
కేటీఆర్ కు చెందిన.జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. హరీశ్ కు చెందిన ఫామ్ హౌస్ అజీజ్ నగర్ లో ఉన్నది వాస్తవం కాదా అని నిలదీశారు సీఎం.
సబితమ్మ పేద అరుపులు అరిస్తే ఎవరూ నమ్మబోరంటూ ఎద్దేవా చేశారు. నీకు ఎన్ని ఫామ్ హౌస్ లు ఉన్నాయో తమ వద్ద చిట్టా ఉందన్నారు. మీ ఫాంహౌస్ లు ఎక్కడ కూలి పోతాయోనని భయపడి పేదలను రక్షణ కవచాలుగా పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ మీరు కట్టుకున్న ఫాంహౌస్ ల నుంచి వచ్చే మురికి నీటి హైదరాబాద్ ప్రజలు తాగాలా అని ఫైర్ అయ్యారు సీఎం.