కొండా సురేఖ కామెంట్స్ బాధాకరం
నటుడు సాయి ధరమ్ తేజ్ కామెంట్స్
హైదరాబాద్ – నటుడు సాయి ధరమ్ తేజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. రాజకీయంలో వ్యక్తిగత విమర్శలు సర్వ సాధారణమై పోయాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు సినిమా రంగాన్ని టార్గెట్ చేయడం బాధకు గురి చేసిందని పేర్కొన్నారు సాయి ధరమ్ తేజ్.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని సూచించారు. ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ ఉంటుంది. వారి వ్యక్తిగత విషయాల గురించి బహిరంగంగా వ్యాఖ్యానించడం సబబు కాదని, ఇది అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఎవరి పట్లనైనా మాట్లాడే ముందు ఆచితూచి కామెంట్స్ చేయాలని హితవు పలికారు. రాజకీయ విమర్శలకు ఏ మాత్రం సంబంధం లేని , తెరమీద తప్ప జీవితంలో నటించలేని సున్నిత మనస్కులైన సినీ నటులను బలి చేయవద్దని విన్నవించారు సాయి ధరమ్ తేజ్.