కొండా సురేఖపై అశ్విని వైష్ణవ్ ఫైర్
సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి
ఢిల్లీ – కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్షవ్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ , ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు. శుక్రవారం కేంద్ర మంత్రి ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించగా ప్రస్తుతం అశ్విని వైష్ణవ్ స్పందించడం విశేషం.
ఇదిలా ఉండగా తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చకుండా ఉండేందుకు కేటీఆర్ వద్దకు ఒక్క రాత్రి సమంత రుత్ ప్రభు వెళ్లాలని అక్కినేని నాగార్జున , అమల ఫ్యామిలీ ఒత్తిడి చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.
ఈ సందర్బంగా మంత్రిపై భగ్గుమన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. సినీ ప్రముఖుల పాత్రను దూషిస్తూ చేసిన ప్రకటనలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని సూచిస్తోందని అన్నారు.
అదే సమయంలో, భారతదేశానికి గర్వ కారణమైన వినోద పరిశ్రమను ఈ పార్టీ ఎలా చూస్తుందో చూపిస్తుందని ధ్వజమెత్తారు. మన సమాజంలో ఇలాంటి చర్చలకు తావు లేదన్నారు. తమ పార్టీకి చెందిన మంత్రి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఇప్పటి వరకు ఎందుకు రాహుల్ గాంధీ, సోనియా , ప్రియాంక , ఖర్గే స్పందించ లేదని ప్రశ్నించారు.