DEVOTIONAL

న్యాయ స్థానాల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్స్

Share it with your family & friends

ఇత‌ర మ‌త‌స్తుల ప‌ట్ల సానుకూల ధోర‌ణి

తిరుప‌తి – ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టుతో పాటు ఇత‌ర కోర్టుల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

తిరుప‌తి వేదిక‌గా వారాహి డిక్లరేష‌న్ స‌భ‌ను చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా పాల్గొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాను స్వ‌చ్ఛ‌మైన హిందువున‌ని ప్ర‌క‌టించారు. తాను ధ‌ర్మం త‌ప్ప‌కుండా ఉండేందుకు స‌నాత‌న ధ‌ర్మం తోడ్ప‌డింద‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో స‌నాత‌న ధ‌ర్మాన్ని దుర్వినియోగం చేసే వారిని, , దాడుల‌కు పాల్ప‌డే వారి ప‌ట్ల న్యాయ స్థానాలు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

“సనాతన ధర్మాన్ని అనుసరించే వారిపై చట్టాలు కఠినంగా ఉంటాయి, ఇతర మతాల అనుచరులకు మానవత్వం చూపబడింది అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం. ఇతర మతాలకు చెందిన వ్యక్తుల పట్ల మృదువుగా ఉంటూనే ‘సనాతన ధర్మాన్ని’ అనుసరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.