రాములమ్మ షాకింగ్ కామెంట్స్
మాట్లాడే ముందు ఆలోచించాలి
హైదరాబాద్ – ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నేత, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సినీ రంగానికి చెందిన అక్కినేని కుటుంబంపై చేసిన దారుణ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఈ తరుణంలో విజయ శాంతి శుక్రవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు మరింత ఆలోచింప చేసేలా ఉన్నాయి. మాటలు మాట్లాడే ముందు వెనుకా ముందు ఆలోచించు కోవాలని సూచించారు. నర్మ గర్భంగా ఎవరినీ ఉద్దేశించి పేర్కొనకుండా ప్రస్తావించడం ఒకింత విస్తు పోయేలా చేస్తోంది.
ఏదైనా మాట్లాడే ముందు మనిషికి సంబంధించి రెండో ఆలోచన, విశ్లేషణ…..ఆ వ్యక్తికి నిజమైన స్నేహితమని దివంగత దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వర రావు ఏదో ఒక సందర్బంగా చెప్పినట్లు తనకు గుర్తుందన్నారు.
జీవితాన్ని చదివి చూసిన మహోన్నతుల మాటలు ఎన్నటికీ సమాజానికి కూడా సందేశాత్మకాలేనని వారిని చూడడం, చదవడం, వారు చెప్పిన వాటిని ఆచరించడం ముఖ్యమని సూచించారు. ఇదే సందర్బంగా నటుడు చిరంజీవి మామ, ప్రముఖ దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య మాటల గురించి చెప్పిన వాటిని కూడా ప్రస్తావించారు రాములమ్మ.
”మనం మాట్లాడిన మాటకు మనం బానిసలం, మాటలాడని మాటకు మనమే యజమానులం అన్న దానిని జాగ్రత్తగా గమనించాలని సూచించారు నటి విజయశాంతి.