ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
తెలుగు అకాడమీ సరైన పరిశోధన కరువు
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు తెలుగు అకాడమీ సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తీవ్రంగా తప్పు పట్టారు.
ప్రభుత్వ సంస్థ అయిన తెలుగు అకాడమీ సరైన పరిశోధన లేకుండా పని చేస్తోందని ఒక రాజ్యాంగ సంస్థ పేర్కొనడం ఎంత సిగ్గు చేటు అని పేర్కొన్నారు. మరి అభ్యర్థులు ఏ పుస్తకాలు చదవాలని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ప్రధానంగా టీజీపీఎస్సీ జీపీ వాదనలు పక్కదోవ పట్టేలా ఉన్నాయని ఆరోపించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వదిలేసి కేవలం కీ అంశానికే పరిమితం చేయాలని చూడడం దురదృష్టకరమని పేర్కొన్నారు బీఆర్ఎస్ నేత.
రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు, నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఒంటెద్దు పోకడ పోతే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. వెంటనే గ్రూప్ -1కు సంబంధించి మెయిన్స్ పరీక్షలు చేపట్టాలని కోరారు.