బఫర్ జోన్ లో ఉందని తేలితే కూల్చేస్తా – కేవీపీ
సంచలన ప్రకటన చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత
హైదరాబాద్ – కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి తన గురించి ప్రస్తావించడంపై స్పందించారు. తన ఫామ్ గురించి పేర్కొనడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కేవీపీ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు.
తన కుటుంబ సభ్యులకు 111 జీవో పరిధిలో ఫామ్ హౌస్ కట్టుకున్నది వాస్తవమేనని ఒప్పుకున్నారు. ఈ మేరకు కేవీపీ అంగీకరించారు కూడా . అయితే ఆ ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో లేదన్నారు. బీఆర్ఎస్ నేతలకు గనుక అనుమానం ఉంటే నిరభ్యంతరంగా రావచ్చని సూచించారు.
ఒకవేళ హైడ్రాకు పూర్తి హక్కులు ప్రభుత్వం కల్పించిందని, తాను కూడా అడ్డుకోనని, ప్రభుత్వమైనా లేదా హైడ్రా అయినా లేదా జీహెచ్ఎంసీ అయినా ఎవరైనా వచ్చి చూడవచ్చని సూచించారు. ఒకవేళ తన ఫామ్ హౌస్ గనుక బఫర్ జోన్ లో ఉందని తేలితే సర్కార్ కూల్చాల్సిన పని లేదన్నారు. తానే ముందుండి తన ఫామ్ హౌస్ ను కూల్చి వేస్తానని సంచలన ప్రకటన చేశారు కేవీపీ రామచంద్రరావు.
అయితే బీఆర్ఎస్ కావాలని రాజకీయం చేస్తోందంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు.