NEWSANDHRA PRADESH

సుప్రీంకోర్టు తీర్పు శిరోధార్యం – కేంద్ర మంత్రి

Share it with your family & friends

ల‌డ్డూ వివాదంపై విచార‌ణ‌కు ఆదేశించ‌డం స‌బ‌బే

విజ‌య‌వాడ – కేంద్ర మంత్రి భూప‌తిరాజు శ్రీ‌నివాస వ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. టీటీడీ ల‌డ్డూ క‌ల్తీ వివాదం విష‌యంపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణ‌యాన్ని, ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర మంత్రి.

టీటీడీ విషయంలో గతంలో అధికార పార్టీ ని బీజేపీ నిలదీయటం జరిగిందని చెప్పారు. గ‌తంలో వైసీపీ స‌ర్కార్ హ‌యంలో భారీ ఎత్తున హిందూ ఆల‌యాల‌పై దాడులు జ‌రిగాయ‌ని ఆరోపించారు. అంతర్వేది లక్ష్మీ నరసింహా స్వామి ర‌థం త‌గుల‌పెట్టిన సంఘటన లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు భూప‌తిరాజు శ్రీ‌నివాస వ‌ర్మ‌.

హిందూ వ్యతిరేక పరమైన దాడులు గత ప్రభుత్వంలో చాలా జరిగాయ‌ని అన్నారు. గత ప్రభుత్వంలో జగన్ తిరుపతిలో నియమ నిబంధనలు పాటించ లేద‌న్నారు. సీఎం హోదాలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు దంపతులు విధిగా ఉండాల‌న్నారు.

కానీ అలాంటి నిబంధనలు పాటించకుండా జగన్ మోహన్ రెడ్డి హిందూ ధర్మాన్ని హేళన చేసారని ఆరోపించారు కేంద్ర మంత్రి. ఏడుకొండలని రెండు కొండలు చేస్తామని ఆనాడు వైస్సార్ చెప్పారని, ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో మీకు తెలుస‌న్నారు. అన్య మతస్తులు వెళ్ళటానికి ఇబ్బందులు లేవు కానీ డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

శాస్త్రానికి, ధర్మానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వ వైఖరి అవలంభించింద‌ని ధ్వ‌జమెత్తారు. తిరుపతి విషయంలో హిందూ ఆరాధ్య దైవమైన స్వామి వారి పట్ల మీ వైఖరి సరైనిధి కాదన్నారు. గ‌తంలో ఏ కేంద్ర‌ మంత్రి కూడా ఫ్యాక్టరీ ని సందర్శించి కార్మికులతో మాట్లాడిన సందర్భాలు లేవన్నారు.

కార్మికుల పొట్ట కొట్టాలని కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమని మనం కాపాడు కోవాలని అనేక ప్రత్యామ్నాయ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు.