NEWSANDHRA PRADESH

జ‌ర‌గ‌ని దానిపై సిట్ విచార‌ణ ఎందుకు..?

Share it with your family & friends

ప్ర‌శ్నించిన మాజీ ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తిరుప‌తి ల‌డ్డూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. ఐదుగురితో ప్ర‌త్యేక విచార‌ణ క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది.

ఇందులో సీబీఐ డైరెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో ఇద్ద‌రు ఉన్న‌తాధికారులు, ఏపీకి చెందిన ఇద్ద‌రు అధికారుల‌తో పాటు ఆహార త‌నిఖీ సంస్థ‌కు చెందిన మ‌రొక నిపుడుతో క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది.

దీనిపై స్పందించారు జ‌గ‌న్ రెడ్డి. సిట్ అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నించారు. అసలు ఏం జరగనిదానికి విచారణ ఎందుకు..? జరగని దాన్ని జరిగిందని పదేపదే ప్రచారం చేసుకుంటున్నారంటూ ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ ల‌పై మండిప‌డ్డారు జ‌గ‌న్ రెడ్డి. ఏ అధికారులు వచ్చి ఏం చేస్తారని, త‌ప్పుడు రిపోర్ట్ ఇస్తే , త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే ఇక ఆ దేవ దేవుడు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారే చూసుకుంటార‌ని హెచ్చ‌రించారు.

@ysjagan @YSRCParty