NEWSTELANGANA

దొడ్డు వ‌డ్ల‌కు రూ. 500 బోన‌స్ చెల్లించాలి

Share it with your family & friends

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైద‌రాబాద్ – రైతులు పండించిన దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ అని ప్రకటించడంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టు కోవాల‌న్నారు.

మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షా 50 వేల కోట్లు అంటున్న ముఖ్యమంత్రికి రైతులకు రైతు భరోసాకి, దొడ్డు వడ్ల బోనస్ కు పైసలు లేవా అని ప్ర‌శ్నించారు. లక్షలాది మంది రైతులకు పంగ నామాలు పెడతామంటే ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. వానా కాలం సీజన్ పూర్తవుతున్నా రైతు భరోసా ఊసే లేద‌న్నారు కేటీఆర్.

మీ ముడుపుల మూసీ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటయ్? కానీ ఆరుగాలం రైతులకు ఇచ్చేందుకు డబ్బులు లేవా అని నిల‌దీశారు. ఇప్పటికైనా అవినీతి ఆలోచనలు మానేసి…రైతులకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాల‌న్నారు.

రైతు రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక చేశారు కేటీఆర్.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్షలో నైనా ఈ అంశంపై స్పందిస్తారని ఆశించినప్పటికీ దాని గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ అంటూ సీఎం మాట్లాడటం చూసి రైతులంతా ఆందోళనలో ఉన్నారని చెప్పారు.