ప్రదర్శనశాలలు అద్భుతం – ఈవో
భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న వైనం
తిరుమల – : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలోని కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫలపుష్ప, అటవీ, శిల్ప, ఫొటో ప్రదర్శనశాలలను టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ప్రారంభించారు.
ఇందులో భాగంగా ప్రవేశ ద్వారంలో ఉంచిన దుర్యోధన పరాభవం, అటవీ శాఖ ఏర్పాటు చేసిన శేషాచల శ్రేణుల సెట్టింగ్, టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ శిల్ప కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు తయారు చేసిన చెక్క, సిమెంట్, లోహ శిల్పాలను సందర్శించారు.
నాడు-నేడు కాన్సెప్ట్‌తో టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫోటో ఎగ్జిబిషన్లను, తిరుమల, దేవాలయం, ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన అరుదైన నాటి ఫోటోల సేకరణ, ప్రస్తుతం తిరుమల అభివృద్ధి చెందిన తీరును తెలిపే చిత్రాలు ఉన్నాయి.
వివిధ శాఖల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఈవో, అదనపు ఈవో అభినందించారు. జేఈవో గౌతమి, సివిఎస్వో శ్రీధర్, ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్
శ్రీనివాసులు, ఎస్వీ ప్రిన్సిపాల్ వెంకట్రమణా రెడ్డి, సీపీఆర్వో డాక్టర్ టి.రవి తదితరులు పాల్గొన్నారు.