నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై రాహుల్ ఫోకస్
పార్టీ కోర్ టీమ్ తో విస్తృతంగా చర్చలు
ఢిల్లీ – దేశంలోని నాలుగు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే విస్తృతంగా పర్యటించారు ఏఐసీసీ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ. ఈ సందర్బంగా పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందని, ఈ ఎన్నికల ఫలితాలు దేశంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షాకు షాక్ తప్పదని పేర్కొన్నారు .
ఇదిలా ఉండగా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా ముందుకు వెళ్లాలనే దానిపై ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో కోర్ టీమ్ తో విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలలో భారీ ఎత్తున ప్రధాన సమస్యల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు పాల్గొన్న సభ్యులు. ఇందులో మేధావులు, ఇతర సంస్థలకు చెందిన వారు హాజరయ్యారు. తమ విలువైన సూచనలు, సలహాలు అందజేశారు.
ప్రధానంగా ఈ చర్చలలో ఆర్థిక వ్యవస్థ, సమాజం, రాజకీయాలపై తనదైన శైలిలో ప్రసంగించారు రాహుల్ గాంధీ. ఆయన సమస్యలపై కలిగి ఉన్న అవగాహనను చూసి పాల్గొన్న వారంతా విస్మయానికి లోనయ్యారు.
కాంగ్రెస్ నాయకత్వంలోని స్వాతంత్య్ర ఉద్యమం ద్వారా రూపు దిద్దుకున్న భారతదేశం ఆలోచన కోసం మనందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ.