NEWSTELANGANA

మూసీ వెనుక ఉన్న ముసుగు దొంగ ఎవ‌రు..?

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న గాడి త‌ప్పింద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జా పాల‌న పేరుతో అధికారంలోకి వ‌చ్చిన సీఎం రేవంత్ రెడ్డి రాచ‌రిక పాల‌న సాగిస్తున్నారంటూ ఆరోపించారు.

హైడ్రా పేరుతో న‌గ‌ర వాసుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. మూసీ వెనుక దాక్కున్న ముసుగు దొంగ ఎవ‌రో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఓ వైపు తీవ్ర ఇబ్బందులు ప‌డుతుంటే మ‌రో వైపు నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు కేటీఆర్.

రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసి లో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు అని నిల‌దీశారు. మూసి పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు? మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రూ. 2500 పెన్ష‌న్ ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు?

అవ్వ, తాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు? ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగా వీరుడు ఎవరు అంటూ రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. మూసి బ్యూటిఫికేషన్ పేరిట 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్ కి తెరతీసిన ఘనుడు ఎవరు అంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్.