ఐనేని అదుర్స్ కేటీఆర్ కంగ్రాట్స్
సూర్యలత కార్మిక నేతగా మూడోసారి
హైదరాబాద్ – నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో పేరు పొందిన సూర్యలత స్పిన్నింగ్ మిల్ లో కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా భారత రాష్ట్ర సమితి పార్టీ బల పరిచిన కార్మిక నాయకుడు ఐనేని సూర్య ప్రకాశరావు ముచ్చటగా మూడోసారి గెలుపొందారు. ఈ సందర్బంగా ఆయన విజయానికి కృషి చేసిన , పాలు పంచుకున్న ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందనలతో ముంచెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
శనివారం తెలంగాణ భవన్ లో గెలుపొందిన సందర్బంగా ఐనేని సూర్య ప్రకాశ రావు మర్యాద పూర్వకంగా తమ నాయకుడు కేటీఆర్ ను కలుసుకున్నారు. ఇదిలా ఉండగా వరుసగా మూడుసార్లు గెలుపొందడం విస్తు పోయేలా చేసింది.
ఇదిలా ఉండగా తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ప్రముఖ విద్యా సంస్థల చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.
విచిత్రం ఏమిటంటే ఇదే కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ జాతీయ నేత ఆచారి ప్రభావాన్ని కాదని ఐనేని సూర్య ప్రకాశ్ రావు తన ఆధిపత్యాన్ని కొనసాగించడం విశేషం. ఈ సందర్బంగా ఐనేనికి కంగ్రాట్స్ తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.