నాగార్జునకు షాక్ కేసు నమోదు
రంగంలోకి దిగిన కాంగ్రెస్ సర్కార్
హైదరాబాద్ – హీరో అక్కినేని నాగార్జునకు బిగ్ షాక్ ఇచ్చింది ఎ. రేవంత్ రెడ్డి సర్కార్. తమ కేబినెట్ లో మంత్రిగా ఉన్న కొండా సురేఖపై కేసు నమోదు చేయడాన్ని సీరియస్ గా తీసుకుంది. తమ్మడికుంట కబ్జా చేశారని, అక్రమంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కట్టారని ఆరోపించింది. ఈ మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇదిలా ఉండగా ప్రతీకార చర్యలకు దిగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు అక్కినేని అభిమానులు. ఇదిలా ఉండగా ఈ వివాదానికి ప్రధాన కారణం మంత్రి కొండా సురేఖ. ఆమె నాగార్జున ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుంది. ఆపై సంచలన ఆరోపణలు చేసింది.
తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చకుండా ఉండేందుకు కేటీఆర్ వద్దకు ఒక్క రాత్రి సమంత రుత్ ప్రభు వెళ్లాలని అక్కినేని నాగార్జున , అమల ఫ్యామిలీ ఒత్తిడి చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆమె చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
దీనిపై సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఖండించారు. వివిధ రంగాలకు చెందిన వారు కూడా తీవ్ర అభ్యంతరం తెలిపారు.