టీ20 మ్యాచ్ కు ఆన్ లైన్ లో టికెట్లు సేల్
హెచ్ సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు
హైదరాబాద్ – క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ . బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తోంది. ఇప్పటికే టెస్టు సీరీస్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా అక్టోబర్ 6 నుంచి టి20 సీరీస్ ప్రారంభం కానుంది.
సీరీస్ లో భాగంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) హైదరాబాద్ లో టి20 మ్యాచ్ నిర్వహించేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు తేదీ కూడా ఖరారు చేసింది. అక్టోబర్ 12న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా కీలక మ్యాచ్ జరగనుంది.
మ్యాచ్ కు సంబంధించి హెచ్ సీ ఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కీలక ప్రకటన చేశారు. శనివారం నుంచే టికెట్ల అమ్మడం ప్రారంభించినట్లు తెలిపారు . మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పేటీఎం ఇన్ సైడర్ వెబ్ సైట్ , యాప్ లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
టిక్కెట్ల ప్రారంభ ధర రూ.750 అని..ఇక గరిష్ఠ ధర రూ.15 వేలుగా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు జగన్ మోహన్ రావు. ఈనెల 8 నుంచి 12 తేదీ వరకు, జింఖానా స్టేడియంలో ఆన్ లైన్ లో బుక్ చేసిన టిక్కెట్లను రిడెమ్షన్ చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి సమయం కూడా నిర్ణయించామని తెలిపారు.
ఉదయం 11 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు గుర్తింపు కలిగిన ఏదైనా ఐడీ కార్డుతో ఆన్ లైన్ బుకింగ్ ప్రింట్ చూపించి టికెట్లు తీసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే ఆఫ్ లైన్ కౌంటర్లలో టికెట్లను విక్రయించడం లేదని వెల్లడించారు హెచ్ సీఏ చీఫ్ జగన్ మోహన్ రావు.