ANDHRA PRADESHNEWS

టికెట్ ఇవ్వ‌క పోయినా వైసీపీ లోనే

Share it with your family & friends

ఏపీ ఐటీ శాఖ మంత్రి అమ‌ర్ నాథ్

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌న‌కు టికెట్ ఇచ్చినా లేదా ఇవ్వ‌క పోయినా బాధ ప‌డ‌న‌ని స్ప‌ష్టం చేశారు. తాను పార్టీని వీడే ప్ర‌స‌క్తి లేదంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. కొంద‌రు కావాల‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు గుడివాడ అమ‌ర్ నాథ్. తాము బీజేపీతో స‌త్ సంబంధాలు కొన‌సాగిస్తున్నామ‌ని చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. వైసీపీ, బీజేపీ రెండు వేర్వేరు పార్టీల‌న్నారు. మా భావ జాలానికి కాషాయ భావ జాలానికి స‌రిపోద‌ని చెప్పారు.

ఎక్క‌డా పొంత‌న అంటూ ఉండ‌ద‌న్నారు. ఏ మాత్రం తెలుసు కోకుండా, అవ‌గాహ‌న లేకుండా మాట్లాడ‌టం ప్ర‌తిప‌క్షాల‌కు అల‌వాటుగా మారింద‌ని మండిప‌డ్డారు మంత్రి అమ‌ర్ నాథ్. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం, అవ‌స‌రాల కోస‌మే తాము కేంద్రంతో సంబంధాలు పెట్టుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

తాను ఏనాడూ ప‌ద‌వుల కోసం పాకులాడ లేద‌న్నారు. ఎవ‌రినీ దేబ‌రించాల్సిన ప‌ని లేద‌న్నారు. త‌మ పార్టీ చీఫ్ , సీఎం ఏ నిర్ణ‌యం తీసుకున్నా దానికి తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని చెప్పారు అమ‌ర్ నాథ్‌.