NEWSANDHRA PRADESH

ఉచిత ఇసుక‌పై దుష్ప్ర‌చారం సీఎం ఆగ్ర‌హం

Share it with your family & friends

గ‌నుల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి మీనాకు ఆదేశం

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం అంద‌రికీ అందుబాటులో ఉండేందుకు గాను ఇసుక పాల‌సీని తీసుకు వ‌చ్చింద‌న్నారు. ఇందులో భాగంగా ఉచిత ఇసుకపై సామాజిక మాధ్యమం వేదికగా సాగుతున్న అసత్య ప్రచారంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

కఠిన చర్యలకు వెనుకాడవద్దని గునుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించారు నారా చంద్ర‌బాబు నాయుడు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేలా జరుగుతున్న ప్రచారంపై సిఎం ఆందోళన వ్య‌క్తం చేశారు.

ప్రజలను తప్పుదారి పట్టించేలా సాగుతున్న సామాజిక మాధ్యమ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. ఉద్దేశ పూర్వక అబద్దాలతో ఉచిత ఇసుకపై ప్రజలలో అనుమానాలు రెకెత్తెలా ప్రచారం చేస్తున్నారని సిఎం ఫైర్ అయ్యారు.

కలెక్టర్లు, ఎస్ పిలకు తగిన అదేశాలు జారీ చేసి, ఈ తరహా వ్యవహారాల పట్ట కఠినంగా వ్యవహరించాలని మీనాను అదేశించారు.

ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న ఇసుక విధానంపై జిల్లా స్ధాయిలో నిజాలను వెలికితీసి, బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని స్ప‌ష్టం చేశారు.