NEWSNATIONAL

రాజీనామా చేయ‌ను పోరాటం ఆప‌ను – సీఎం

Share it with your family & friends

బీజేపీ..జేడీఎస్ కుట్ర‌ల‌ను బ‌హిర్గ‌తం చేస్తా

క‌ర్ణాట‌క – ముడా కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎలాంటి కార‌ణం లేకుండానే త‌న‌ను సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని కోరుతున్నార‌ని మండిప‌డ్డారు. నాకూ బోర్ గా ఉంద‌న్నారు. ఇక చాలు కానీ..మీ అంద‌రి కోసం పోరాటం కొన‌సాగిస్తాన‌ని ప్ర‌క‌టించారు సిద్ద‌రామ‌య్య‌.

వారి బెదిరింపుల‌కు తాను భ‌య‌ప‌డేటోన్ని కాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌ను ముఖ్య‌మంత్రి గ‌ద్దె దించేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ, జేడీఎస్ కుట్ర‌ను ఛేదిస్తాన‌ని , మీ అంద‌రి ఆశీస్సులు త‌న‌పై ఉండాల‌ని కోరారు సిద్ద‌రామ‌య్య‌. మీరంద‌రూ బీజేపీని గుణ‌పాఠం చెప్పాల‌ని పిలుపునిచ్చారు సీఎం.

ఇక్క‌డ ఇంత‌టి అపూర్వ‌మైన ఆత్మ గౌర‌వ స‌భ‌ను నిర్వ‌హించినందుకు, ఏర్పాటు చేసినందుకు ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని చెప్పారు సిద్ద‌రామ‌య్య‌.

కన్నడ కావలు సమితి అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాన‌ని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కన్నడ తప్ప మరే భాష లోనూ ప్రభుత్వ ఫైళ్లపై సంతకం చేయ లేద‌ని చెప్పారు .
కన్నడిగుడిగా పుట్టినందుకు తాను గర్వ పడుతున్నానని అన్నారు సీఎం.