NEWSNATIONAL

రూ. 2.5 కోట్ల స్కామ్ లో ఎన్ఐఏ ఆఫీస‌ర్ అరెస్ట్

Share it with your family & friends

సంచ‌ల‌నంగా మారిన డీఎస్పీ అజ‌య్ సింగ్

ఉత్త‌ర ప్ర‌దేశ్ – దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది ఎన్ఐఏ డీఎస్పీ అజ‌య్ ప్ర‌తాప్ సింగ్ అరెస్ట్ వ్య‌హారం. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ. 2. 5 కోట్ల రూపాయ‌లు లంచంగా ఇవ్వాల‌ని బేర మాడారాంటూ ఆయ‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది.

కీల‌క‌మైన ద‌ర్యాప్తు సంస్థ ఎన్ఐఏలో డీఎస్పీగా ఉన్నార‌ను అజ‌య్ ప్ర‌తాప్ సింగ్. ఆయ‌న స్వ‌స్థలం ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని చందౌలి జిల్లా టోర్వా గ్రామం.

సింగ్ ఎన్ఐఏలోలో డీఎస్పీగా చేర‌క ముందు ఆదాయపు ప‌న్ను శాఖ‌లో త‌న కెరీర్ ను ప్రారంభించాడు. కేవలం రెండేళ్ళ సర్వీసు ఉన్నప్పటికీ భారీగా పెద్ద ఎత్తున డ‌బ్బుల‌ను సంపాదించాలనే కోరిక అత‌డి కెరీర్ ను నాశ‌నం చేసేలా చేశాయి.

ఈ సంఘటన దేశంలోని అత్యంత గౌరవనీయమైన చట్టాన్ని అమలు చేసే సంస్థలను కూడా పీడిస్తున్న నిరంతర అవినీతిపై తీవ్ర దృష్టిని ఆకర్షించేలా చేసింది. ఒక ర‌కంగా అవినీతి ఏ ర‌కంగా ఆక్టోప‌స్ లా పేరుకు పోయిందో అజ‌య్ ప్ర‌తాప్ సింగ్ అరెస్ట్ ఓ ఉదాహ‌ర‌ణ‌.