జమ్మూ కాశ్మీర్ లో ఒమర్ అబ్దుల్లాకే ఛాన్స్
ఎగ్జిట్ పోల్స్ 2024లో కాంగ్రెస్, పీడీపీ హవా
జమ్మూ కాశ్మీర్ – ఈ ఏడాది దేశ వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూసిన ఎన్నికలు ఏవైనా ఉన్నాయంటే అది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించింది మాత్రమే. ఎన్నికలు ముగిశాయి. ఇటు హర్యానాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ 2024 ఢంకా భజాయించి చెబుతున్నాయి.
ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. రిపబ్లిక్ మ్యాట్రిక్ సర్వేలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో పీడీపీకి 28 సీట్లు , బీజేపీకి 25, కాంగ్రెస్ పార్టీకి 12, ఎన్సీకి 15 సీట్లు వస్తాయని తెలిపింది.
ఇక ప్రముఖ దినపత్రిక దైనిక్ భాస్కర్ సర్వేలో బీజేపీకి 20 నుంచి 22 సీట్లు , కాంగ్రెస్ , ఎన్సీ పార్టీలకు 35 నుంచి 40 సీట్లు , పీడీపీకి 4 నుంచి 7 సీట్లు, ఇతరులు 12 నుంచి 16 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఇక ఇండియా టుడే సీఓటర్ సర్వే లో ఎన్సీ , కాంగ్రెస్ పార్టీలు కలిపి 40 నుంచి 48 సీట్లు , బీజేపీకి 27 నుంచి 32 , పీడీపీ 6 నుంచి 13 , ఇతరులు 6 నుంచి 12 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. అయితే ఉమ్మడి అభ్యర్థిగా ఒమర్ అబ్దుల్లా సీఎం కానున్నారని సమాచారం. మొత్తంగా ఇండియా కూటమికి బిగ్ రిలీఫ్ అని చెప్పక తప్పదు.