దేశంలో డబుల్ ఇంజన్ విఫలం – కేజ్రీవాల్
భారతీయ జనతా పార్టీ..మోడీపై ఆగ్రహం
ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీని, పీఎం మోడీని, కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షాను ఏకి పారేశారు. ఆదివారం తమ పార్టీ ఆధ్వర్యంలో జనతా కీ ఆదాలత్ కార్యక్రమంలో ప్రసంగించారు.
హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి వివిధ జాతీయ న్యూస్ ఛానళ్లలో న్యూస్ వస్తున్నాయని, వాటిని తాను చూశానని విస్తు పోవడం జరిగిందన్నారు అరవింద్ కేజ్రీవాల్.
విచిత్రం ఏమిటంటే ఘోడీ మీడియా ఇంకా వాస్తవాలను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తిరిగి హర్యానా, జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తిరిగి వస్తుందని చెబుతున్నాయని, ఏ ప్రాతిపదికన ఇలా ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి.
అన్ని ప్రసార మాధ్యమాలు తెలుసు కోవాల్సింది ఏమిటంటే దేశంలో డబుల్ ఇంజిన్ విఫలమైందన్నారు. జూన్‌లో 240 సీట్లు వచ్చినప్పుడు మొదటి ఇంజన్ విఫలమైందన్నారు. రెండవ ఇంజన్ కూడా జార్ఖండ్ , మహారాష్ట్ర నుండి నెమ్మదిగా విఫలం కాక తప్పదని జోష్యం చెప్పారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి అని ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు.