శివ తీసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్
కీలక వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ
హైదరాబాద్ – వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు . ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా నటుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇవాళ్టి రోజుకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అదేమిటంటే తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకుంది శివ చిత్రం.
ఆనాడు ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బాక్సులు బద్దలు అయ్యాయి. మూస ధోరణిలో వెళుతున్న తెలుగు సినిమాను ఒక్కసారిగా షేక్ చేసింది. ఇందులో నటించింది ఎవరో కాదు అక్కినేని నాగార్జున, అమల.
ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన శివను తీసి ఇప్పటికి ఇవాల్టితో సరిగ్గా 35 ఏళ్లు గడిచాయి. ఈ సందర్బంగా నాగార్జున ట్విట్టర్ వేదికగా తన ఆసక్తిని, అభిప్రాయాలను పంచుకున్నారు. మరో వైపు తన కథను నమ్మి అవకాశం ఇచ్చినందుకు, శివ సినిమా తీసేలా చేసినందుకు నాగార్జునకు థ్యాంక్స్ అంటూ తెలిపారు రామ్ గోపాల్ వర్మ.