NEWSTELANGANA

గ్యారెంటీల పేరుతో మోసం ప్ర‌జ‌ల‌కు శాపం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని ఆరోపించారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. ఆదివారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి పై, స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని అన్నారు.

గ్యారెంటీలు అమలు చేయలేక పోగా, మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచ లేద‌న్నారు, రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు బంధును నిలిపి వేశారని ఆరోపించారు త‌న్నీరు హ‌రీశ్ రావ రైతు భరోసా దిక్కు లేకుండా పోయిందన్నారు. బోనస్‌ను బోగస్ చేశారంటూ ఎద్దేవా చేశారు.

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పార‌ని ప‌ది నెల‌లు పూర్త‌యినా వాటి ఊసే లేద‌న్నారు. అతీ గ‌తీ లేద‌ని, ఇక రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నించారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ ‌- బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించాల‌ని పిలుపునిచ్చారు.