DEVOTIONAL

ముత్యపు పందిరి వాహనంపై శ్రీ‌వారి ద‌ర్శ‌నం

Share it with your family & friends

బకాసుర వధ అలంకారంలో శ్రీ‌ మలయప్ప

తిరుమల – శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవితో కలిసి బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న సేవ‌లో ద‌ర్శించుకున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు . జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియ జేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆది శేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామి వారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.

వాహ‌న సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి, టీటీడీ ఈవో జె. శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు గౌతమి, వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీధర్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.