DEVOTIONAL

క‌ల్ప‌వృక్ష వాహనంపై శ్రీవారి వైభవం

Share it with your family & friends

అంగ‌రంగ వైభ‌వంగా బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కోట్లాది మంది భ‌క్లులు భావించే ప్ర‌సిద్ధ పుణ్య క్షేత్రం తిరుమ‌ల గిరులు భ‌క్తుల‌తో కిట‌కిట లాడుతోంది. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల‌లో శ్రీ‌వారిని ద‌ర్శ‌నం చేసుకుంటే స‌క‌ల రోగాలు పోతాయ‌ని, అష్ట అయిశ్వ‌ర్యాలు సిద్దిస్తాయ‌ని విశ్వాసం..న‌మ్మ‌కం కూడా.

ఇదిలా ఉండ‌గా నాలుగో రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనసేవ నిర్వహించారు. కల్పవృక్ష వాహనంపై స్వామి వారి వైభవాన్ని తిలకించి భక్తులు పులకించి పోయారు. రాత్రి స్వామి వారికి సర్వభూపాల వాహనసేవ నిర్వ‌హించ‌నుంది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ మంగళవారం రాత్రి జరగనుంది. ఈ వాహన సేవను దాదాపు రెండు లక్షల మంది భక్తులు గ్యాలరీల్లోంచి వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో జె.శ్యామలరావు వెల్ల‌డించారు.

అంతర్గత రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్డులో వేచి ఉండే భక్తులకు సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్, గోవిందనిలయం నార్త్‌వెస్ట్‌ కార్నర్, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులు లగేజీ లేకుండా క్యూలైన్‌లో ప్రవేశించాలని సూచించారు. గ‌రుడ సేవ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు ఈవో.