NEWSNATIONAL

ఓడి పోయినా బీజేపీకి ఢోకా లేదు

Share it with your family & friends

యాక్సెస్ మై ఇండియా చీఫ్

ఢిల్లీ – దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టి ప్ర‌స్తుతం జ‌మ్మూ కాశ్మీర్, హ‌ర్యానా రాష్ట్రాల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఉంది. దీనికి కార‌ణం భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏ మేర‌కు తిరిగి ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌నే దానిపై చర్చ జ‌రుగుతోంది. హ‌ర్యానాలో ఖ‌ట్ట‌ర్ కార‌ణంగా బీజేపీకి భారీ న‌ష్టం వాటిల్లింద‌ని ఆ పార్టీకి చెందిన వారే చెబుతుండ‌డం విశేషం.

అయితే తాజాగా దేశ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ చ‌రిష్మా, అమిత్ చంద్ర షా మ్యాజిక్ ఏదీ ప‌ని చేయ‌లేదు. ఊహించ‌ని విధంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. 99 సీట్లు కైవ‌సం చేసుకుంది. నితీశ్ కుమార్ , చంద్ర‌బాబు నాయుడు స‌పోర్ట్ తో బీజేపీ మూడోసారి కొలువు తీరింది.

ఇదిలా ఉండ‌గా తాజాగా రెండు రాష్ట్రాలలో జ‌రిగిన ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు యాక్సిస్ మై ఇండియా చీఫ్ నెంబ‌ర్ వ‌న్ సెఫాల‌జిస్ట్ ప్ర‌దీప్ గుప్తా. హ‌ర్యానా, కాశ్మీర్ రాష్ట్రాల‌లో ఓట‌మి పాలైనా పార్టీకి, మోడీకి ఒరిగేది ఏమీ ఉంద‌న్నారు.

హర్యానాలో తన ప్రధాన ఓటు బ్యాంకును నిలుపుకుంటూ బీజేపీ జమ్మూని కైవసం చేసుకుంటోందని ఆయన అన్నారు. సోమ‌వారం ప్ర‌దీప్ గుప్తా మీడియాతో మాట్లాడారు.

హర్యానాలో ఏ పార్టీ కూడా వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించ లేద‌ని చెప్పారు. 2014లో పదేళ్ల అధికారం తర్వాత కాంగ్రెస్‌కు కేవలం 20 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయ‌ని తెలిపారు.