సీత పాత్రలో మిస్ యూనివర్స్ రియా సింఘా
అయోధ్య రామ్ లీలా చిత్రంలో ఎంపిక
హైదరాబాద్ – మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత , ప్రముఖ మోడల్ రియా సింఘా తీపి కబురు చెప్పింది. ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. అయోధ్య గ్రాండ్ రాం లీలా చిత్రంలో శ్రీరాముడి భార్య సీత పాత్రలో నటించేందుకు ఎంపికైనట్లు తెలిపింది.
“శ్రీరాముడి ఆశీస్సులతో ప్రపంచంలోనే అతిపెద్ద అయోధ్య రామలీలాలో సీత పాత్రలో నటించే అవకాశం నాకు లభించింది” అని సంతోషం వ్యక్తం చేసింది.
“ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ టైటిల్ గెలవడానికి నేను శ్రీ రాముడు, సీత ఆశీర్వాదం కోరుకుంటాను అని తెలిపింది రియా సింఘా. ఇదిలా ఉండగా ఆమె స్వస్థలం గుజరాత్. సెప్టెంబర్ 15, 2005లో పుట్టింది.
సెప్టెంబర్ లో జరిగిన మిస్ యూనివర్శ్ ఇండియా పోటీలలో విజేతగా నిలిచింది. గ్రామానంద్ గ్రూప్ యాజమాన్యం ఈ పోటీలను నిర్వహించింది. కాగా వచ్చే నెల నవంబర్ 16న మెక్సికోలో జరిగే మిస్ యూనివర్శ్ పోటీలలో రియా సింఘా భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహించనుంది.
మిస్ యూనివర్స్ ఇండియా విజయానికి ముందు రియా సింఘా మిస్ టీన్ ఎర్త్ 2023 టైటిల్‌ను కలిగి ఉంది.