ENTERTAINMENT

దేవ‌ర క‌లెక్ష‌న్ల జాత‌ర

Share it with your family & friends

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత దేవ‌ర‌

హైద‌రాబాద్ – డైన‌మిక్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్, జాహ్న‌వి క‌పూర్ , సైఫ్ అలీ ఖాన్, ప్ర‌కాశ్ రాజ్ , శ్రీ‌కాంత్ , త‌దిత‌రులు క‌లిసి న‌టించిన దేవ‌ర దుమ్ము రేపుతోంది. క‌లెక్ష‌న్ల ప‌రంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా ఏకంగా పాజిటివ్ రావ‌డంతో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది. ఏకంగా ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం క‌లెక్ష‌న్ల‌తో పాటుగా దేవ‌ర క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్ట‌డం విశేషం.

తాజాగా సినీ వ‌ర్గాల నుంచి అందిన విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఇప్ప‌టికే రూ. 400 కోట్ల మార్క్ దేవ‌ర చిత్రం దాటడం విశేషం. విడుదైల‌న 10 రోజుల‌లో ఇన్ని కోట్లు క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌డం జూనియ‌ర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక దేవ‌ర సినిమాకు సంబంధించి క‌లెక్ష‌న్ల ప‌రంగా చూస్తే 1వ రోజు రూ. 154.36 కోట్లు, 2వ రోజు రూ. 61.24 కోట్లు, 3వ రోజు రూ. 63.51 కోట్లు, 4వ రోజు రూ. 24. 70 కోట్లు, 5వ రోజు రూ. 19.16 కోట్లు, 6వ రోజు రూ. 30.27 కోట్లు, 7వ రోజు రూ. 12.65 కోట్లు వ‌చ్చాయి. తొలి వారంలో దేవ‌ర సినిమా రూ. 365.89 కోట్లు కొల్ల‌గొట్టింది.

ఇక రెండ‌వ వారంలో తార‌క్ మూవీ 1వ రోజు రూ. 9.59 కోట్లు, 2వ రోజు రూ. 13.23 కోట్లు, 3వ రోజు రూ. 15.90 కోట్లు క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 10 రోజుల‌కు క‌లిపి రూ. 404.61 కోట్లు క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది.